జూన్ 3 నుంచి ‘జనగణమన’ షూట్‌లో పూజాహెగ్డే

జూన్ 3 నుంచి ‘జనగణమన’ షూట్‌లో పూజాహెగ్డే

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా నటిస్తున్న చిత్రం జ‌న‌గ‌ణ‌మ‌న‌. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ  సినిమా షూటింగ్ జూన్ తొలివారంలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. అయితే జనగణమనలో పూజా హీరోయిన్ కాదని, ఐటెమ్ సాంగ్కే పరిమితమవుతుందని వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని, ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పూజా పీఆర్ టీం ప్రకటించింది. జనగణమనలో ఆమె హీరోయిన్గా పూర్తిస్థాయి పాత్రలో కనిపించనుందని స్పష్టం చేసింది. జూన్ 3 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న షెడ్యూల్లో పూజా జాయిన్ కానుంది. ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ పూజా హెగ్డేలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 మూవీలో పూజా హెగ్డే నటించిన ఐటెం సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బీస్ట్, ఆచార్య సినిమాలతో నిరాశలో ఉన్న పూజాకు ఎఫ్ 3 కాస్త రిలీఫ్ ఇవ్వగా.. జనగణమనతో బుట్టబొమ్మ అదృష్టం ఎలా మారుతుందో వేచి చూడాల్సిందే.