ఇళ్లు, పట్టాల కోసం కలెక్టరేట్ ముట్టడి

ఇళ్లు, పట్టాల కోసం కలెక్టరేట్ ముట్టడి

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని సీపీఎం నేతలు మహాధర్నా చేపట్టారు. నిరసనలో భాగంగా మహిళలు రోడ్డు పై బైఠాయించారు. మహా ధర్నాలో సీపీం నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పేదలకు పట్టాలిచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. మరోవైపు ధర్నాకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పలువురు CPM నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
శాంతియుతంగా నిరసనలకు పిలుపునిస్తే.. ప్రభుత్వం తమ వారిని అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా అరెస్టులు చేస్తోందని... నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కార్యదర్శి వస్తుంటే మార్గం మధ్యలోనే పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధంలోకి తీసుకున్న వారినందరినీ తక్షణమే విడుదల చేయాలని.. అలాగే 58జీవో ప్రకారం పేదలందరికీ పట్టాలిచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే వరకు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. 
8 ఏళ్లు ఎదురు చూసినా పట్టాల్లేవు... పక్కా గృహాల్లేవు.. డబుల్ బెడ్రూములు రాలే
పేదల కళ్ల ముందున్న భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రాజకీయ నేతల బినామీలు ఆక్రమించుకుంటుంటే పేదల జానెడు జాగా కోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయి రోడ్డెక్కారని సీపీఎం నేతలు పేర్కొన్నారు. పట్టాల కోసం.. పక్కా గృహాల కోసం పేదలు ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకుని.. చేసుకుని విసిగి వేసారిపోయారని.. ఇప్పుడు 10వేల మంది వచ్చి గుడిశెలు వేసుకున్నారని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ప్రజలు ఎంతకైనా తెగించి పోరాడతారని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండి

నాలాలు కబ్జా అయినా పట్టించుకోలేదు

నిర్మాతలకు ‘కాసుల’ కష్టాలు

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్