V6 News

మహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : పీఓడబ్ల్యూ సంధ్య

మహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : పీఓడబ్ల్యూ సంధ్య
  •     ఇన్నాళ్లు పూర్తి మెజార్టీ ఉన్నా పట్టించుకోలే..
  •     ఎన్నికలు ఉన్నాయనే బిల్లు: పీఓడబ్ల్యూ సంధ్య

అబిడ్స్, వెలుగు: మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నాయకురాలు సంధ్య విమర్శించారు. మంగళవారం హైదర్​గూడలో నిర్వహించిన సమావేశంలో మహిళా నాయకులు ఝాన్సీ, అనసూయ కలిసి ఆమె మాట్లాడారు. 2014 నుంచి పూర్తి మెజారిటీ ఉన్నా పట్టించుకోని కేంద్రం.. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ‘నారీ శక్తి వందన్ అధినేయం’ చట్టాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. 

ఈ బిల్లును జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి 2029 వరకు వాయిదా వేయడం మహిళలను వంచించడమేనని మండిపడ్డారు. నిబంధనల పేరుతో మెలికలు పెట్టకుండా, మహిళా సాధికారత కోసం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.