
హనుమాన్ జయంతి సందర్భంగా ‘ఆదిపురుష్’ టీం కొత్త అప్ డేట్ ను ఇచ్చింది. ఇందులో పురాణ పురుషుడు శ్రీ రాముడి పాత్రను యంగ్ రెబల్ స్టార్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అంతే కీలకమైన ఆంజనేయుడి పాత్రలో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించి మూవీ టీం కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. రాముడి ఛాయపై సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా ధ్యానముద్రలో ఆంజనేయుడు కూర్చున్నట్టుగా ఇందులో చూపారు. బ్యాక్ గ్రౌండ్ లో ఇచ్చిన ప్రభాస్ గ్లింప్స్ సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లకన్నా ఇందులో ఆంజనేయుడి పవర్ఫుల్ లుక్ ను ప్రజెంట్ చేశారు. ‘‘రామ భక్తుడు.. రామకథకు ప్రాణమైన పవనపుత్రుడికి జై’’ అంటూ ప్రభాస్ క్యాప్షన్ ను యాడ్ చేశాడు.
తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో ఈ పోస్టర్ ను సినిమా టీం విడుదల చేసింది. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను జూన్ 16 న థియేటర్లలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్ పలు వివాదాలను సైతం చవిసూసింది. అయినప్పటికీ అభిమానుల్లో ఆదిపురుష్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు.
https://www.instagram.com/p/CqrT_PTvoaY/?utm_source=ig_web_copy_link