90 సెకన్ల బీభత్సం.. సలార్ టీజర్ అప్డేట్

90 సెకన్ల బీభత్సం.. సలార్ టీజర్ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్  గెట్ రెడీ. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్(Salaar) టీజర్ వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జులై 7న సలార్ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel). ఈ టీజర్ డ్యూరేషన్ 90 సెకండ్స్ గా ఫిక్స్ చేశారట. 

ఈ 90 సెకెండ్లలోనే..  సలార్ గా ప్రభాస్ మాస్ భీబత్సం సృష్టించనున్నాడని సమాచారం. ఒక నిమిషం ముప్పై సెకన్ల పాటు సాగే ఈ టీజర్ సాలిడ్ గా ఉండనుందట. టీజర్ మొత్తం హై విల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో, గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశాడట ప్రశాంత్. ప్రభాస్ లుక్స్, డైలాగ్స్ నెక్స్ట్ లెవల్లో ఉండనున్నాయట. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ టీజర్ ను కట్ చేశారట మేకర్స్.

ప్రభాస్ గత మూడు సినిమాలతో ఫుల్ డిజప్పాయింట్ లో ఉన్న ఫ్యాన్స్ కు.. ఈ టీజర్ ఫుల్ మీల్స్ ఇవ్వనుందట. బాహుబలి(Bahubali) తరువాత ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఎం మిస్ అయ్యారో అవన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో జులై 7న యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవడం, సైట్స్ అన్ని క్రాష్ అవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.