హెల్త్ డైరెక్టరేట్ లో ప్రజా దర్భార్..భారీగా అప్లికేషన్స్

హెల్త్ డైరెక్టరేట్ లో  ప్రజా దర్భార్..భారీగా అప్లికేషన్స్

ప్రజా దర్భార్ ని జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులే నిర్వహిస్తారు. కానీ.. మొదటిసారిగా ఆరోగ్య శాఖ కోఠీలోని హెల్త్ డైరెక్టరేట్  లో ప్రజా దర్భార్ నిర్వహించింది. 317 జీవోతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు...నెల రోజులుగా హెల్త్ డైరెక్టరేట్  చుట్టూ తిరుగుతున్నారు. చిన్న పిల్లలతో, గర్భిణీలు, దివ్యాంగులు జిల్లాల నుంచి రోజూ పడిగాపులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్...ఆఫీస్ ముందు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడి.. వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు.  రెండు రోజుల నుంచి ప్రజా దర్భార్ ఏర్పాటు చేయగా... హెల్త్ సమస్యలు, దివ్యాంగులు, spouse అప్లికేషన్స్ రోజుకు 2 వందల దాకా వస్తున్నాయి. ఈ ప్రజా దర్భార్ వారం రోజులు నిర్వహిస్తామనీ... జెన్యూన్ అప్లికేషన్స్ పరిశీలిచి బదిలీ చేస్తామన్నారు హెల్త్ డైరెక్టర్  శ్రీనివాస్.