నిలకడగా ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్!

నిలకడగా ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్!

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రక్తప్రసరణ మెరుగ్గానే ఉందని, ఆయన హెల్త్ కండీషన్‌ను ఎక్స్‌పర్ట్స్‌ టీమ్ నిశితంగా పర్యవేక్షిస్తోందని తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆర్మీ హాస్పిటల్ పేర్కొంది. ప్రణబ్‌కు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటిలేటర్‌‌పై ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని తెలిపింది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈ నెల 10న సర్జరీ చేశారు. ఆ టైమ్‌లో జరిపిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.