రఘు కుంచె లీడ్ రోల్‌లో చైతన్య మోటూరి రూపొందించిన చిత్రం ‘గేదెల రాజు’. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుడు వీవీ వినాయక్, రైటర్ కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై రఘు కుంచెతో పాటు మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
రఘు కుంచె మాట్లాడుతూ ‘ఇందులో తెలుగు నేటివిటీతో కూడిన మంచి కథలు ఉన్నాయి. కాకినాడలో ఉండే గేదెల రాజు అనే రౌడీ చుట్టూ అల్లుకున్న ఆ కథలన్నీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగా చివర్లో ఓ అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఆ సర్ ప్రైజింగ్ రియాక్షన్ సినిమాను కాపాడుతుందని నమ్ముతున్నా. మైత్రీ సంస్థ వందకుపైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తోంది’ అని చెప్పారు. నటీనటులు శ్రావ్య, వికాస్, దర్శకుడు చైతన్య మోటూరి, నిర్మాత రవికుమార్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.

