Preeti Pawar: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 బాక్సింగ్ రణరంగంలో భారత వీరనారి ప్రీతి పవార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈరోజు (ఆగస్టు, శనివారం) ఎస్ఈసీ హాల్ 5 వేదికగా జరిగిన మహిళల 54 కేజీల బాక్సింగ్ ఫైనల్లో కెనడాకు చెందిన ఎస్ఎస్ డెల్గాడోపై సింహంలా విరుచుకుపడింది. ప్రత్యర్థికి కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా 5–0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
నాక్‌డౌన్ పంచ్‌తో ప్రత్యర్థి మైండ్ బ్లాంక్:
ఫైనల్ పోరు ఆరంభం నుంచే ప్రీత్ పవార్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రింగ్‌లో అడుగు పెట్టిన క్షణం నుంచి బెదురు లేని దూకుడుతో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ఐదుగురు జడ్జిలు మూడు రౌండ్లలోనూ ప్రీతికే పూర్తి మార్కులు వేస్తూ 30–27తో పర్ఫెక్ట్ తీర్పు ఇచ్చారు. ఇక మ్యాచ్ మధ్యలో ప్రీతి విసిరిన పవర్‌ఫుల్ పంచ్‌కు కెనడియన్ బాక్సర్ రింగ్‌లోనే కిందపడిపోవడం (Knockdown) ఈ భారత రారాణి పంచ్ పవర్‌కు షాక్ అయింది.
కామన్వెల్త్ వేదికపై ఎగిరిన త్రివర్ణ పతాకం:
కేవలం బలంతోనే కాకుండా, మైండ్ గేమ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను తుత్తునియలు చేసింది ప్రీతి పవార్.. అద్భుతమైన ఫుట్‌వర్క్, షార్ప్ కంబైన్డ్ పంచ్‌లు, వ్యూహాత్మక క్రమశిక్షణతో మ్యాచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. డెల్గాడో కంబ్యాక్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నింటినీ తన డిఫెన్స్‌తో తిప్పికొట్టింది. ఈ గోల్డెన్ విక్టరీతో గ్లాస్గో వేదికగా భారత జెండాను అత్యున్నత పీఠంపై నిలిపిన ప్రీతి.. తన కెరీర్‌లో ఒక గొప్ప మైలురాయిని దాటింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సింగ్ సత్తా ఏంటో, మన దేశీ వీరనారుల పౌరుషం ఏంటో ప్రపంచ వేదికపై ఆమె మరోసారి చాటిచెప్పింది.
🥇𝐏𝐑𝐄𝐄𝐓𝐈 𝐏𝐀𝐖𝐀𝐑 — 𝐆𝐎𝐋𝐃𝐄𝐍 𝐆𝐋𝐎𝐑𝐘!🇮🇳
— All India Radio News (@airnewsalerts) August 1, 2026
India's Preeti Pawar wins gold in women's 54kg event in boxing after beating Canada's Scarlett Savannah Delgado#TeamIndia #CommonwealthGames #Glasgow2026 #Cheer4Bharat #Boxing #IndiaAtCWG
@mansukhmandviya | @khadseraksha… pic.twitter.com/xoU3KKTHwN
