ఉద్యోగుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం

ఉద్యోగుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం
  • టీఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేత అశ్వద్ధామ

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత కోసం మరో ఉద్యమానికి సిద్ధమని టీఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేత అశ్వద్ధామ ప్రకటించారు. ఎల్బీనగర్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాలులో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన  కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అన్ని డిపోల నుండి వచ్చిన డ్రైవర్స్, కండక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వద్ధామ మాట్లాడుతూ.. మీ అందరికి అండగా నేను ఉంటానని స్పష్టం చేశారు. ఆంధ్రలో ఉద్యోగ భద్రత ఉందని, మనకి ఉద్యోగ భద్రత లేదని, ప్రభుత్వం వెంటనే అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని.. అది చేసే వరకు వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగధనుల స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని,  భద్రాద్రి డిపో సురేందర్ రెడ్డి త్యాగము, మెహదీపట్నం డిపోకి చెందిన వారి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని  ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని వారు మాత్రమే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గతంలో ఉద్యోగ భద్రత కోసం అందరి అభిప్రాయం మేరకు దీక్ష  చేసాను కానీ నా స్వార్థం కోసం దీక్ష చేయలేదని గుర్తు చేశారు. విమర్శలు చేస్తే వద్దని మా వాళ్లు అంటుంటారు.. కానీ విమర్శలు చేయకపోతే ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్పారు. షోకాజ్ నోటీసు గురించి ప్రస్తావిస్తూ.. మీ షోకాజ్ నోటీస్ నాకు టిస్యూ పేపర్ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ధర్మారెడ్డి మన టార్గెట్ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే కూల్చేయాలి

రైతుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. సచిన్‌కు పవార్ చురకలు!

సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది

కిలాడీ మహిళల చిలిపి దొంగతనం