సీఎం హిమంతకు కృతజ్ఞతలు చెప్పాలి: రాష్ట్రపతి

సీఎం హిమంతకు కృతజ్ఞతలు చెప్పాలి: రాష్ట్రపతి

గౌహతి: అస్సాం సీఎం హిమంత తనను ‘డాటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది స్టేట్‌‌‌‌’ అన్న మాట తన మనసును తాకిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టీ కార్మికుల కోసం, మహిళా ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె మెచ్చుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముర్ము తొలిసారి అస్సాంలో పర్యటించారు. పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.

ఆమె వర్చువల్‌‌‌‌గా టీ గార్డెన్‌‌‌‌ ఏరియాల్లో 100 మోడల్‌‌‌‌ సెకండరీ స్కూళ్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారం భించి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ‘డాటర్​ ఆఫ్​ అస్సాం’ అంటూ సీఎం స్వాగతించారు. దీనిపై ప్రెసిడెంట్​ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం హిమంతకు కృతజ్ఞతలు చెప్పాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు.