ఢిల్లీ : 2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 112 మంది విజేతల్లో ఇవాళ 56 మందికి రాష్ట్రపతి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. మిగిలినవారికి ఈ నెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
అవార్డులు అందుకున్న ప్రముఖులు వీరే..
నటుడు మోహన్‌లాల్- పద్మభూషణ్
సర్దార్ సుఖ్‌దేవ్ సింగ్ దిల్సా – పద్మభూషణ్
హకుందేవ్ నారాయణ్ యాదవ్ – పద్మభూషణ్
ప్రముఖ జర్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్(మరణానంతరం) -పద్మభూషణ్(ఈ అవార్డును ఆయన భార్య భారతి నయ్యర్ అందుకున్నారు)
రెజ్లర్ భజరంగ్ పునియా – పద్మశ్రీ
చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక – పద్మశ్రీ
టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ – పద్మశ్రీ
విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్ – పద్మశ్రీ
నటుడు ప్రభుదేవా – పద్మశ్రీ
సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ – పద్మశ్రీ
కబడ్డీ ఆటగాడు అజయ్ ఠాకూర్ – పద్మశ్రీ
President Kovind presents Padma Bhushan to Shri Viswanathan Mohanlal for Art. A renowned film actor from Kerala, Shri Mohanlal has acted in about 350 films, in a career spanning 40 years pic.twitter.com/SZhdEfj49w
— President of India (@rashtrapatibhvn) March 11, 2019
