రాష్ట్రపతి గురించి పుస్తకాల్లోనే తెలుసుకునే వాళ్లం : తమిళి సై

రాష్ట్రపతి గురించి పుస్తకాల్లోనే తెలుసుకునే వాళ్లం : తమిళి సై

కేశవ్ మెమోరియల్ సేవలు ప్రశంసనీయమని గవర్నర్ తమిళి సై అన్నారు. విద్యార్థులు దేశం కోసం పనిచేయాలని ఆమె చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని అన్నారు. తాము చదువుకున్న రోజుల్లో రాష్ట్రపతి ఎవరన్నది పుస్తకాల్లో చదివి తెలుసుకునే వాళ్లమని.. ఇప్పుడు మీరంతా రాష్ట్రపతిని దగ్గరగా చూస్తున్నారని అన్నారు.సెక్యురిటీని కూడా పక్కన పెట్టి.. గిరిజనుల దగ్గరకు వెళ్లి వారి గురించి తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము అందరికీ ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై ప్రశంసించారు. 

కేశవ్ మెమోరియల్ ఇన్ స్టిట్యూట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె పలు సూచనలు చేశారు.