రెండు రోజులు హైదరాబాద్‌‌లో మోడీ

రెండు రోజులు హైదరాబాద్‌‌లో మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఇతర కీలక నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యార. స్థానిక పోలీసులు, లోకల్ నేతలతో ఎస్పీజీ బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జూలై 02, 03 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. జూలై 03వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.

మోడీ టూర్ షెడ్యూల్ : -
2వ తేదీ..
12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరుతారు.
2 .55 బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు.
3.00కు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో పయనం.
3.20 HICC నోవాటెల్ కి ప్రధాని చేరిక.
3.30 నోవాటెల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని.
3.30 నుండి 4 గంటల వరకు రిజర్వ్.
సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోడీ హాజరు
రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్.

3.07.22 : -
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు.
సాయంత్రం 4. 30 నుండి 5.40 వరకు రిజర్వ్.
సాయంత్రం 5.55 HiCC వద్ద హెలిప్యాడ్ వద్దకు ప్రధాని. 
సాయంత్రం 6.15 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
6.30 నిమిషాలకి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్ కు పయనం.
6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.
రాత్రి 7.35 గంటలకు బహిరంగ సభ నుండి మోడీ పయనం.
ఆ రాత్రికి నోవాటెల్ లేదా రాజ్ భవన్ లో మోడీ బస.

4 .07. 22 : -
ఉదయం 9.20కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
బేగంపేట నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో పయనం.
10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం.
ఇందులో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉందంటున్న పోలీసులు.