అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత.. ఇరాన్ యుద్ధం ఆపుతుంది: ట్రంప్ 

అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత.. ఇరాన్ యుద్ధం ఆపుతుంది: ట్రంప్ 

అమెరికాలో మధ్యంతర ఎన్నికల హీట్ రాజుకుంటున్న క్రమంలో ఇరాన్ తో యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకే టెహ్రాన్ పోరాటాన్ని ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తోందని అన్నారు. ఎన్నికల తర్వాత ఇరాన్ తో నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోతాయని అన్నారు ట్రంప్. బుధవారం ( సెప్టెంబర్ 9 ) డల్లాస్ పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

ఎన్నికలు ముగిసిన తక్షణమే ఈ యుద్ధం ముగియబోతోందని అన్నారు ట్రంప్. ఇరాన్ ఇక ఏమాత్రం నిలదొక్కుకోలేదని.. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి.. అణ్వాయుధాన్ని సొంతం చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకుంటే యావత్ ప్రపంచానికే ప్రమాదమని అన్నారు ట్రంప్.

ముడి చమురు ధరలు బ్యారెల్ కు 100 డాలర్ల మార్క్ దాటడానికి ఇరాన్ తో ఉద్రిక్తతలే ప్రధాన కారణమని అన్నారు. ఎన్నికల అనంతరం చమురు, గ్యాసోలిన్ ధరలు భారీగా తగ్గుతాయని అన్నారు ట్రంప్. గ్యాసోలిన్ ధరలు గ్యాలన్ కు 2 డాలర్ల కంటే తక్కువకు తీసుకొస్తానని అన్నారు ట్రంప్. ప్రస్తుతానికి ఇరాన్ తో చర్చలు జరిపే ఉద్దేశం లేదని.. భవిష్యత్తులో కూడా జరగకపోవచ్చని చెప్పలేను అన్నారు ట్రంప్.