కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త తరం ఐఫోన్‌లను ఘనంగా ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ పేరుతో, కొత్త సీఈవో జాన్ టెర్నస్ ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ‘ఐఫోన్ డ్యుయో’ పేరుతో తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను టెర్నస్ అమెరికా మార్కెట్లోకి రిలీజ్ చేశారు.
దీంతోపాటు ఐఫోన్ 18 ప్రో, ప్రోమాక్స్ మోడల్స్ ను కూడా ఆయన రిలీజ్ చేశారు. భారత మార్కెట్లో ఐఫోన్ డ్యుయో ప్రారంభ ధర రూ.2,99,900 గా, ఐఫోన్ 18 ప్రో, ప్రోమాక్స్ ల ప్రారంభ ధరలు రూ.1,64,900, రూ.1,79,900 గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి ప్రీ ఆర్డర్ లు, ఈ నెల 18 నుంచి రిటైల్ అమ్మకాలను ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
