న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును మార్చింది. పీఎంవో పేరును సేవాతీర్థ్‌గా నామకరణం చేసింది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను పార్లమెంట్ కొత్త భవనంలోకి మార్చిన విషయం తెలిసిందే. వాయు భవన్‌కు ఆనుకుని ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్-I లో కొత్తగా మూడు భవనాలు నిర్మించారు.
అందులో ఒకటి ప్రధానమంత్రి కార్యాలయంగా పని చేస్తుంది. ఈ భవనానికి సేవాతీర్థ్‌గా నామకరణం చేశారు. మిగిలిన రెండు భవనాలు సేవా తీర్థ్-2 క్యాబినెట్ సెక్రటేరియట్, సేవా తీర్థ్-3 జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయాన్ని నిర్వహిస్తాయి. ఈ ఎన్క్లేవ్‌లో ఇప్పటికే అధికారిక కార్యకలాపాలు మొదలయ్యాయి. 2025, అక్టోబర్ 14న సేవా తీర్థం-2లో క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సర్వీస్ చీఫ్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
అలాగే.. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రాజ్ భవన్ల పేర్లను కూడా ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా ఛేంజ్ చేసింది. ఇక నుంచి రాజ్ భవన్‌లనులోక్ భవన్లుగా సంబోధించాలని.. అధికార, అనధికార జాబితాలు.. పత్రాలు సహా మీడియా కూడా ఇదే తరహాలో పేర్కొనాలని కేంద్రం పేర్కొంది.
