గుర్తు పట్టలేనంతగా మారిన పృథ్విరాజ్

గుర్తు పట్టలేనంతగా మారిన పృథ్విరాజ్

పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న  చిత్రం ‘ఆడు జీవితం’. ఇంగ్లీష్‌‌లో ‘ద గోట్‌‌ లైఫ్‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ సర్వైవల్ డ్రామా ట్రైలర్‌‌‌‌ను శనివారం విడుదల చేశారు. 2008లో బెన్యామిన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

‘పొట్ట కూటి కోసం సౌదీకి వలస వెళ్లిన కేరళకు చెందిన నబీబ్ మహ్మద్ అనే వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు అన్నది మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌. పాస్‌‌ పోర్టులు లాక్కుని బానిసగా మార్చడంతో ఎడారిలో గొర్రెల కాపరిగా ఎలాంటి నరకయాతనను అనుభవించాడు అనేది ట్రైలర్‌‌‌‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు. నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌‌‌‌ బ్లెస్సీ..  గత పదిహేనేళ్లుగా ఈ మూవీపై వర్క్ చేస్తున్నాడు. 

ఇంటర్నేషనల్‌‌ అవార్డ్స్ లక్ష్యంగా రూపొందుతున్న ఈ మూవీలో వలస కూలీగా, బానిసగా కనిపించేందుకు తన లుక్‌‌ను గుర్తు పట్టలేనంతగా మార్చుకున్నాడు పృథ్విరాజ్. అతనికి జంటగా అమలాపాల్ నటిస్తోంది. ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌కు పంపిన ట్రైలర్‌‌‌‌ ఆన్‌‌లైన్‌‌లో లీక్ అవడంతో ఒరిజినల్ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. కేరళతో పాటు జోర్డాన్, అల్టీరియా, సహారా ఎడారిలో షూటింగ్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు.