ప్రియాంక చోప్రా కూతురు ...చో క్యూట్..!

ప్రియాంక చోప్రా కూతురు ...చో క్యూట్..!

ప్రియాంక చోప్రా..ఈ పేరు చెప్తే కుర్రకారు గుండెల్లో గులాబీలు గుభాలిస్తాయి. బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ రేంజ్ను సాధించింది. 2018లో హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ ను వివాహం చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సెటిల్ అయింది. వీరికి ఒక పాప. ఆమె పేరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌.  చాలా రోజుల తర్వాత భారత్కు వచ్చిన ప్రియాంక చోప్రా దంపతులు... ముంబై  ఎయిర్‌పోర్ట్లో  సందడి చేశారు. 

వివాహం తర్వాత ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తుంది. ఇందులో భాగంగా మార్చి31 శుక్రవారం మధ్యాహ్యం భర్త నిక్‌ జొనాస్ ‌, కూతురు  మల్తీ మేరీ చోప్రా జొనాస్‌ తో కలిసి ముంబై కి చేరుకుంది. అయితే ప్రియాంక తన  కుమార్తెతో కలిసి ఇండియాకు రావడం ఇదే ఫస్ట్ టైం. ప్రియాంక చోప్రా, హస్బెండ్ నిక్‌ జోనాస్‌, కూతురు మాల్టీతో కలిసి ఎయిర్ పోర్ట్ బయట కనిపించారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా కెమెరాలకు తన కూతురుని చూపిస్తూ  ప్రియాంక చోప్రా మురిసిపోయింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో ప్రియాంక చోప్రా నటించింది. 2017లో బేవాచ్‌ మూవీతో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సమయంలో తనకంటే చిన్నవాడైన పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2022లో సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత తన భర్త నిక్‌తో కలిసి ప్రియాంక లాస్ఏంజెల్స్‌లోనే సెటిల్ అయింది.  పలుహాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక లవ్‌ ఎగైన్‌ మూవీలో నటిస్తోంది.  అంతకు ముందు ది మ్యాట్రిక్స్ సెరురెక్షన్స్ మూవీలోనూ యాక్ట్ చేసింది.