స్టూడెంట్స్ను పోలీసులతో కొట్టించడం దారుణం..జరుగుతున్న పరిణామాలకు మోదీదే బాధ్యత: ప్రియాంక గాంధీ 

స్టూడెంట్స్ను పోలీసులతో కొట్టించడం దారుణం..జరుగుతున్న పరిణామాలకు మోదీదే బాధ్యత: ప్రియాంక గాంధీ 

న్యూఢిల్లీ: జంతర్​ మంతర్​ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో కొట్టించడం దారుణమని, జరుగుతున్న పరిణా మాలన్నింటికీ ప్రధాని మోదీనే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌‌‌‌ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. ‘‘విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. ఇంటర్నెట్‌‌ను నిలిపివేయడంతో వారి కుటుంబాలు కూడా వారిని సంప్రదించలేక ఆందోళన చెందుతున్నాయి.

ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?” అని ప్రియాంక ప్రశ్నించారు. గురువారం పార్ల మెంట్‌‌ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోదీ హయాంలో 152 సార్లు పేపర్​ లీకులు జరిగినా ఒక్కరికీ శిక్ష పడలేదని ఆరోపిం చారు. ఒలింపిక్స్‌‌, ఆసియా క్రీడలు, అంతరిక్ష విజయాలు వంటి ప్రతి విజయాన్నీ తన ఖాతాలో వేసుకునే ప్రధాని.. విద్యార్థులపై జరుగుతున్న చర్యలకు కూడా బాధ్యత వహించా లని డిమాండ్​ చేశారు. ఒకవైపు పిల్లల సంక్షేమమే తనకు ముఖ్యమని సోషల్‌‌ మీడియాలో పోస్టులు పెడుతూనే.. మరోవైపు విద్యార్థులను కొట్టించడం, వారిపై టియర్‌‌గ్యాస్‌‌ ప్రయోగించడం ఏమిటని ప్రశ్నిం చారు. విద్యార్థులు ఆవేదనను ప్రభుత్వం వినాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక పేర్కొన్నారు.