న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చి ప్రభుత్వం ఏం సాధించాలని అనుకుంటున్నదని కాంగ్రెస్పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ మార్పుతో ప్రభుత్వానికి భారీ ఖర్చు తప్ప.. ఇంకేం లేదని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘ఈ నిర్ణయం వెనుక ఏ దురాలోచన ఉందో అర్థం కావడం లేదు. పథకం పేరు ముందు మహాత్మా గాంధీ అని ఉంది.. దాన్ని మార్చడం వల్ల ప్రజాధనం ఖర్చవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి స్టేషనరీ వరకు ప్రతిదీ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా అనవసర ప్రక్రియ’ అని అన్నారు. ఇదే విషయంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియంకా చతుర్వేది కూడా స్పందించారు. ఇది సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని విమర్శించారు.
