గిరిజన వర్గాల హక్కులను కాపాడాలి..కేరళ ప్రభుత్వానికి ప్రియాంక లేఖ

గిరిజన వర్గాల హక్కులను కాపాడాలి..కేరళ ప్రభుత్వానికి ప్రియాంక లేఖ

వయనాడ్: రాష్ట్రంలోని గిరిజన వర్గాల అటవీ హక్కుల(పీవీటీజీ) ను కాపాడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ మినిస్టర్ ఓఆర్. కేలుకు లేఖ రాశారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు అటవీ హక్కుల చట్టం–2006 కింద ఇప్పటివరకు పీవీటీజీలకు హక్కులు మంజూరు కాలేదని తనకు తెలిసిందని చెప్పారు. 

గిరిజన వర్గాలకు భూమిపై హక్కులను కల్పించడమే కాకుండా వారి సాంస్కృతిక పద్ధతులు, సాంప్రదాయ జీవనోపాధిని రక్షించే పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన హక్కులను కూడా గుర్తించడం చాలా కీలకమని తెలిపారు. అడవుల ఆక్రమణ, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు గిరిజన వర్గాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.