India Playing XI: టీ20 క్రికెట్ మహా సంగ్రామానికి సమయం వచ్చేసింది. ఇంగ్లాండ్ వేదికగా ఈరోజు (జూన్ 12) నుంచే ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2026 మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ టోర్నీ గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతోంది. ఇక క్రికెట్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న హై-వోల్టేజ్ పోరు.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం (జూన్ 14) ఎడ్జ్‌బాస్టన్‌లోనే జరగనుంది. ఈ క్రేజీ మ్యాచ్ పై.. టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ భారత్ తరఫున బరిలోకి దిగే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ (Playing XI) ను అంచనా వేశాడు.
ఓపెనింగ్ జోడీ కిర్రాక్:
* ఓపెనర్లు: ఎప్పటిలాగే డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు.
* మిడిలార్డర్: ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న యస్తికా భాటియాను 3వ స్థానంలో (వన్-డౌన్) ఆడించాలని అభిషేక్ నాయర్ చెప్పాడు. 4వ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్, 5వ స్థానంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌కు వస్తారు.
* పవర్ హిట్టర్: 6వ స్థానంలో రిచా ఘోష్ తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను ఫినిష్ చేయగలదని పేర్కొన్నాడు.
►ALSO READ | ధర్మశాలలో ఉరుములు, మెరుపులు.. రేపటి భారత్ vs ఆఫ్ఘన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
రాధా యాదవే బెస్ట్:
జట్టులో ఫినిషర్, స్పిన్నర్ స్లాట్ కోసం భారతి పుల్మాలి, రాధా యాదవ్ మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ తెలిపాడు. అయితే భారతి పుల్మాలి కంటే లెఫ్టార్మ్ స్పిన్నర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల రాధా యాదవ్ కే తన ఓటు వేశాడు. ఆమెతో పాటు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్పిన్ విభాగంలో కీలకం కాబోతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌లు చూసుకుంటారని అభిషేక్ నాయర్ అంచనా వేశాడు.
అభిషేక్ నాయర్ తుది జట్టు:
షఫాలీ వర్మ, స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్.
No. 18 🤝 Iconic players! 👀✨#SmritiMandhana reveals the story behind her jersey number & how No. 18 became a special part of her cricketing journey! 💙🏏
— Star Sports (@StarSportsIndia) June 12, 2026
ICC Women's #T20WorldCup 2026 | #INDvPAK 👉 SUN, 14th June, 6 PM pic.twitter.com/J39WWdTu4B
