IND Vs AFG 1st ODI: ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు రెడీ అయింది. శనివారం (జూన్ 13) నుంచి భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ మధ్య మూడు వన్డేల సిరీస్ షురూ కాబోతోంది. ధర్మశాల (HPCA Stadium) వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ఫస్ట్ వన్డే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు వాతావరణం నుంచి ముప్పు పొంచి ఉంది.
వర్షంతో మ్యాచ్ క్యాన్సిల్ అవుతుందా?:
* వాతావరణం: శనివారం ధర్మశాలలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండనుంది. గాలిలో తేమ 51 శాతంగా నమోదయ్యే ఛాన్స్ ఉంది.
* వాన గండం: మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో దాదాపు 90 శాతం వాన పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.
గుడ్ న్యూస్: సాయంత్రం అయ్యేసరికి మబ్బులు కొంచెం కరుణించేలా ఉన్నాయి. కాబట్టి ఓవర్లు కొన్ని తగ్గే ఛాన్స్ ఉన్నా.. మ్యాచ్ మాత్రం పూర్తిగా రద్దయ్యే (Washout) అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.
* జూన్ నెలలో ధర్మశాలలో వాన పడటానికి సాధారణంగా 42 శాతం ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. టాస్ పడ్డప్పటి నుంచే ఇరు జట్ల కెప్టెన్లు కళ్లు మొత్తం ఆకాశం వైపే ఉంచుతారు.
ఆఫ్ఘన్ని తక్కువ అంచనా వేయలేం:
పేపర్ మీద టీమిండియా మస్తు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నప్పటికీ.. లాస్ట్ ఆడిన మూడు వన్డే సిరీస్‌లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో రెండు సిరీస్‌లు ఓడిపోయింది. కాబట్టి 2027 వన్డే వరల్డ్ కప్‌ను సీరియస్‌గా తీసుకుని కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే మనోళ్లకు ఈ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. కాగా ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే వంటి కొత్త కుర్రాళ్ల ఎనర్జీ టీమ్‌కు ప్లస్ కానుంది.
►ALSO READ | 20 ఏళ్ల కింద ఫుట్‌బాల్ కామెంట్రీ.. నిద్రలేకుండా పని చేశానన్న హర్షా భోగ్లే
ఇక విరాట్ కోహ్లీ లేని వన్-డౌన్ (నెంబర్ 3) ప్లేస్‌లో ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి గట్టి పోటీ పడుతున్నారు. మరోవైపు వన్డే ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్‌ను అంత ఈజీగా తీసిపారేయలేం.. గత రెండేళ్లుగా వాళ్లు ఒక్క బైలాటరల్ వన్డే సిరీస్ కూడా ఓడిపోలేదు.. ఐర్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి జట్లపై వరుస సిరీస్ విజయాలతో వాళ్లు ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.
World’s most beautiful stadium 🏟️ #INDvAFG #India pic.twitter.com/LuMS8naW2g
— Indian Cricket News (@IndianCricNews) June 12, 2026
