Harsha Bhogle FIFA World Cup: క్రికెట్ కామెంట్రీలో తన గొంతుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న లెజెండరీ ఇండియన్ కామెంటేటర్ హర్షా భోగ్లే (Harsha Bhogle) తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పాత రోజులని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం మెక్సికో, యూఎస్‌ఏ, కెనడా వేదికలుగా 'ఫిఫా వరల్డ్ కప్ 2026' గ్రాండ్‌గా స్టార్ట్ అయిన నేపథ్యంలో.. సరిగ్గా 20 ఏండ్ల కిందట (2006 లో) తాను ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎక్స్ (ట్విట్టర్) లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన బ్రాడ్‌కాస్టింగ్ కెరీర్‌లోనే అది అత్యంత కష్టమైన, అలాగే గర్వించదగ్గ పని అని చెప్పుకొచ్చాడు.
ఇండియా కోసమే హోస్టింగ్:
అప్పట్లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కేవలం ఇండియా వరకే లిమిట్ అయి ఉండేవని హర్షా భోగ్లే గుర్తు చేసుకున్నాడు. భారతదేశంలో చాలా మంది ఫుట్‌బాల్‌ను సరదాగా (Casual గా) చూసేవాళ్లే ఉంటారు కాబట్టి.. వాళ్లకు లోకల్ కనెక్టివిటీ ఇచ్చేందుకు ఛానెల్ మేనేజ్‌మెంట్ ఒక తెలిసిన ఇండియన్ ఫేస్ కావాలని తనను సెలెక్ట్ చేయగా.. అయితే, క్రికెట్ వేరు, ఫుట్‌బాల్ వేరు కాబట్టి.. ఈ మెగా టోర్నీ కోసం హర్షా భోగ్లే దాదాపు నెల రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేసి, ఫుల్ రీసెర్చ్ చేసి బరిలోకి దిగాడట.
సింగపూర్‌లో నైట్ డ్యూటీలు:
ఆ ఫిఫా వరల్డ్ కప్ టైమ్‌లో తన షెడ్యూల్ ఎంత దారుణంగా ఉండేదో హర్షా భోగ్లే వివరించాడు. ఆ టోర్నమెంట్ కోసం ఆయన సింగపూర్‌లో పని చేశాడు. ప్రతి మ్యాచ్‌ను హోస్ట్ చేయడానికి రాత్రంతా స్టూడియోలోనే జాగారం చేసేవాడట. మ్యాచ్‌లన్నీ ముగిసి, డ్యూటీ అయిపోయేసరికి తెల్లవారుజామున 5:30 గంటలు అయ్యేదట.. ఆ టైమ్‌లో హోటల్‌కు వచ్చి, బ్రేక్‌ఫాస్ట్ తిని.. మధ్యాహ్నం వరకు పడుకుని.. మళ్లీ సాయంత్రం కాగానే స్టూడియోకు పరుగెత్తేవాడట. టోర్నీ జరిగినన్ని రోజులూ ఇదే డ్యూటీ చేసినట్లు ఆయన రాసుకొచ్చాడు.
ALSO READ : 19,346 రన్స్, 48 సెంచరీలు..
ఎక్స్‌పర్ట్స్ సపోర్ట్:
ఆ సమయంలో తనకు ప్రొడక్షన్ టీమ్‌తో పాటు ఫుట్‌బాల్ లెజెండ్స్ నుంచి మస్తు సపోర్ట్ దక్కిందని కామెంటేటర్ హర్షా భోగ్లే చెప్పాడు. ముఖ్యంగా నార్తర్న్ ఐర్లాండ్ మాజీ ఇంటర్నేషనల్ ప్లేయర్, గ్రేట్ ఫుట్‌బాల్ పండిట్ గెర్రీ ఆర్మ్‌స్ట్రాంగ్ (Gerry Armstrong) తనకు ఎంతో హెల్ప్ చేశాడని కృతజ్ఞతలు తెలిపాడు. టీవీ చూసే ఆడియన్స్‌కు ఎంత తెలుసో.. నాకు కూడా అంతే తెలుసనే నమ్మకంతో నేను షో చేశాను.. అందుకే ఒక స్టూడెంట్‌లా కొత్త విషయాలు అడుగుతూ, నేర్చుకుంటూ కామెంట్రీ ఇచ్చానని భోగ్లే వెల్లడించాడు.
20 years since I hosted the FIFA World Cup for Star; still my most challenging assignment and one of my proudest moments.
— Harsha Bhogle (@bhogleharsha) June 12, 2026
The rights were only for India and there is a large non-core football audience that comes in so an Indian face, who could offer an Indian context, was…
