తెలంగాణకు వచ్చేందుకు, వెళ్లేందుకు, ఇక్కడ పోటీ చేసేందుకు పవన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే మంత్రులు పవన్‌పై స్పందించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అలాగే.. హిట్లర్ తనకు ఆదర్శమని తానెప్పుడూ చెప్పలేదన్న రేవంత్ రెడ్డి.. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
►ALSO READ | కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తుండు..బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నయ్ : సీఎం రేవంత్
మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో అసలు కేసే లేదని రేవంత్ స్పష్టం చేశారు.ఇప్పటిదాకా గాడ్సేను మాత్రమే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను కూడా ఆదర్శంగా తీసుకుందని విమర్శించారు. అయితే ఓట్ చోరీ.. లేకపోతే సీట్ చోరీ.. ఈ రెండే బీజేపీకి తెలుసని మండిపడ్డారు. సంఖ్యా బలం లేకపోయినా మధ్యప్రదేశ్‌లో మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు. ఈ ఘటనతో బీజేపీ అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, ఇటు మహిళా వ్యతిరేకిగా మారిందని.. ఈ వివాదం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరపూరిత దాడికి దిగుతోందని ధ్వజమెత్తారు.
