కాచిగూడ, వెలుగు: కాచిగూడ ఎక్స్ రోడ్స్‌లోని స్వీకార్ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. వంట గదిలో ఫంగస్ ఉన్న క్యాబేజీ, కుళ్లిన టమాటాలు, పురుగు పట్టిన ఆలుగడ్డలు, సిట్రస్ క్యాంకర్ సోకిన నిమ్మకాయలను గుర్తించారు. ఎలాంటి లేబుళ్లు, మూతలు లేని ఫుడ్ ఐటమ్స్, బ్యాచ్ నంబర్లు లేని నూడుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఉడికించిన నూడుల్స్, పచ్చి కూరగాయలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల క్రాస్ కంటామినేషన్ ప్రమాదం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోటల్‌లో ఫాస్టాక్ శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడంతోపాటు పెస్ట్ కంట్రోల్, వాటర్ క్వాలిటీ, ఎంప్లాయ్ హెల్త్ రికార్డులు నిర్వహించడం లేదని తేల్చారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
