- యుద్ధం ఆపేందుకు భారత్ నాయకత్వం వహించాలి: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి చర్చలకు భారత్ నాయకత్వం వహించాలని కాంగ్రెస్ సూచించింది. దేశంలో ఏర్పడిన ఎల్‌పీజీ కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకు వివరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. సోమవారం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. " పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంపై చాలా ఎక్కువగా ఉంది. దేశంలోని ఎల్‌పీజీ సంక్షోభంపై ప్రధాని ఇప్పటికైనా నోరు విప్పాలి. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ఇతర సమస్యలపై కూడా మోదీ ఇప్పటికే మాట్లాడాల్సింది" అని తెలిపారు.
అంతకుముందు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ..యుద్ధం ఆగడానికి ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. "యుద్ధం భారత్‌కు నేరుగా నష్టం కలిగిస్తోంది. దీనిని ఆపాలి. మనం వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాం. డీజిల్ ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.. ఇప్పటికే రూ. 21 పెరిగింది. గతంలో మన విదేశీ విధానం తటస్థంగా ఉండేది. అందుకే అందరూ మనతో మిత్రులుగా ఉండేవారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు దగ్గరవ్వడం వల్ల ఆ సమతుల్యత దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్‌తో సహా అన్ని దేశాలతో గతంలోలాగే మంచి సంబంధాలు కొనసాగించాలి" అని అన్నారు. ఉజ్వల పథకం కింద ఇచ్చిన సిలిండర్లు ప్రస్తుతం ఖాళీగా పడి ఉన్నాయని.. గ్యాస్ అందుబాటులో లేక ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిల వద్దకు వెళ్లాల్సి వస్తోందని శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయని తెలిపారు. "ఇరాన్ అణు పరిశోధనా రియాక్టర్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది.
