హైదరాబాద్లో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు

హైదరాబాద్లో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 మూడో దశ మ్యాచ్లు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. రేపటి నుండి డిసెంబర్ 10 వరకు జరిగే మ్యాచుల్లో  12  టీమ్లు ప్లే ఆఫ్ బెర్త్ల కోసం తలపడనున్నాయి. ఈ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్లు సహా ఫైనల్ మ్యాచ్ ముంబయిలో జరగనున్నాయి. హోం టీమ్ తెలుగు టైటాన్స్ మొత్తం 8 మ్యాచ్లు ఆడనుంది. కరోనాతో మూడేళ్ల తర్వాత మళ్లీ డైరెక్ట్గా ప్రో కబడ్డీ మ్యాచ్లు చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తున్నారు.

తెలుగు టైటాన్స్ కీలక ప్లేయర్లకు గాయాలవడంతో జట్టు బ్యాలెన్స్ దెబ్బతిన్నదని హెడ్ కోచ్ వెంకటేషం తెలిపారు. రానున్న మ్యాచుల్లో గట్టి పోటీ ఇస్తామన్నారు. ఈ సీజన్ మెరుగ్గా ముగించే అవకాశం ఉందని చెప్పారు. సిటీలో జరగనున్న మ్యాచ్లు ఫ్యాన్స్ను అలరిస్తాయని నిర్వాహకులు వెల్లడించారు.