తమను రెగ్యులరైజ్ చేయాలంటూ.. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మత్స్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నిరసనలో పాల్గొన్నారు. ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న మత్స్యశాఖ ఆఫీసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యశాఖ పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లను ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుందని మండిపడ్డారు. ఈ ఆఫీసర్ల వల్లే కదా.. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
మత్య్స రైతులను తయారు చేయడంలో వీరి పాత్ర కీలకమైందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్దీకరించాలని సూచించారు. త్వరలో మూడు లక్షల మంది కాంట్రక్టు ఉద్యోగులతో హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు.
