నెట్వర్క్, వెలుగు: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై తెలంగాణవ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్, పాఠశాలల్లో తరగతుల బహిష్కరణలు సక్సెస్‌గా నిర్వహించారు. నాయకులు భారీ ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జీని, వారికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
