సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన..

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన..
  • ఇవాళ్టి నుంచి సీనియర్ రెసిడెంట్స్ ఎలక్టివ్ సర్వీసుల బహిష్కరణ
  • 18 మెడికల్ కాలేజీలు, 28 ఆస్పత్రుల్లో ఒపి, వార్డుల విధులు బహిష్కరణ
  • ఎనిమిది నెలలుగా స్టైఫండ్ కు నోచుకోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ 
  • కొన్ని రోజులుగా ఆస్పత్రుల ముందు నిరసన
  • అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినా కనిపించని ప్రయోజనం
  • గత్యంతరం లేక సమ్మెబాట పడుతున్నాం
  • తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. 8 నెలలుగా తమకు స్టైఫండ్‌‌ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు, మంత్రులకు కి ఎన్నిసార్లు వివరించినా జీతాలు ఫలితం లేకుండా పోయిందన్నారు.

బుధవారం నుంచి అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో ఓపి, ఎలక్టివ్ సర్జరీలను నిలిపివేస్తున్నట్లు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకుంటే శుక్ర వారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కొవిడ్​ టైంలో పీజీలు పూర్తికాగానే సర్కారీ దవాఖాన్లలో విధుల్లోకి చేరామని, కానీ జీతాలు ఇవ్వకుండా సతాయించడం కరెక్ట్​ కాదని వాపోయారు. స్టైఫండ్​ ఇవ్వకపోవడంతో  దాదాపు 698 మంది రెసిడెంట్​డాక్లర్లు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.