పఠాన్ మూవీపై వివాదం.. హీరో షారుఖ్ దిష్టిబొమ్మ దహనం

పఠాన్ మూవీపై వివాదం.. హీరో షారుఖ్ దిష్టిబొమ్మ దహనం

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ సినిమా పఠాన్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆ మూవీ నుంచి రిలీజైన బేషరమ్ అనే పాట రిలీజైంది. ఈ సాంగ్ లో హీరోయిన్ దీపికా పదుకుణె బికినీలో కనిపించింది. దీంతో ఈ విషయంపై రచ్చ మొదలైంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలిగిస్తే తప్ప ఈ సినిమాకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. లేదంటే  నిషేధం తప్పదని హెచ్చరించారు. 

ఇండోర్ నగరంలోనూ పఠాన్ సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఈ మూవీ హీరో షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బేషరమ్ రంగ్ పాటలో కంటెంట్ వల్ల హిందూ సమాజం మనోభావాలు దెబ్బతింటున్నాయని ఈ సందర్భంగా వీర్ శివాజీ గ్రూప్ ఆరోపించింది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా విడుదలైన ఓ పాటలోని సన్నివేశాలు అభ్యంతరంగా ఉన్నాయని, ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఈ వివాదంపై సినిమా యూనిట్ మాత్రం ఇంకా ఏం స్పందించకపోవడం గమనార్హం.