V6 News

తేజస్వి వ్యాఖ్యలపై గ్రేటర్లో నిరసనలు

తేజస్వి వ్యాఖ్యలపై గ్రేటర్లో నిరసనలు

సిటీ నెట్​వర్క్, వెలుగు: తెలంగాణ ఏర్పాటును భారత్​- -పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితమని, దీనిని అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్య తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తూ తేజస్వి సూర్యను బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎంజె మార్కెట్ కూడలిలో గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వీ నాయకులు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, యువమోర్చా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ నేతృత్వంలో ఉప్పల్ డిపో వద్ద నిరసన తెలపగా, జేబీఎస్ చౌరస్తాలో కంటోన్మెంట్ కాంగ్రెస్ శ్రేణులు సూర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.