బదిలీలు, పోస్టింగ్ లలో కౌన్సెలింగ్ విధానం పీఆర్టీయూతోనే : టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

బదిలీలు, పోస్టింగ్ లలో కౌన్సెలింగ్ విధానం పీఆర్టీయూతోనే :  టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
  •     టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే ఫస్ట్ టైమ్ కౌన్సెలింగ్ విధానంతో టీచర్ల బదిలీలు, పోస్టింగ్​లను పొందే ఉత్తర్వులు సాధించిన చరిత్ర పీఆర్టీయూదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. 55 ఏండ్లుగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ఏకైక సంఘం పీఆర్టీయూ అని కొనియాడారు. సోమవారం హైదరాబాద్​లోని యూనియన్ ఆఫీస్​లో పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి సంఘం జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీపాల్ రెడ్డి.. సంఘం వ్యవస్థాపకుడు సాముల యాదగిరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే పీఆర్టీయూ అతిపెద్ద సంఘమని చెప్పారు. మన రాష్ట్రంలో తెచ్చిన కౌన్సెలింగ్ విధానాన్నే ఇప్పుడు మిగతా రాష్ట్రాలు, ఇతర ఉద్యోగ సంఘాలు ఫాలో అవుతున్నాయని గుర్తుచేశారు. సకల జనుల సమ్మె కాలానికి జీతం సాధించడంతో పాటు మహిళా టీచర్లకు అదనపు సెలవులు అప్పటి సీఎం చంద్రబాబుతో కొట్లాడి సాధించుకున్నామన్నారు.