Unstoppable 2 : బాలయ్య – పవన్ ఫస్ట్ గ్లింప్స్

Unstoppable 2 : బాలయ్య – పవన్ ఫస్ట్ గ్లింప్స్

బాలయ్య అన్ స్టాపబుల్ షో .. ఆహాలో వస్తున్న ఈ షో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయి రికార్డ్ లు సృష్టించింది. ఇపుడు అందరి దృష్టి మరో ఎపిసోడ్ పై పడింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ డిసెంబర్ లోని షూటింగ్ పూర్తయింది. అప్పటి నుంచి ఫోటోలు ప్రోమోలతో హైప్ తెస్తున్నారు.  లేటెస్ట్ గా  సంక్రాంతి పండుగ సందర్భంగా   అభిమానులకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో పవన్ ,బాలయ్య ఎంట్రీ సీన్ అదిరింది.    స్టేజ్ పై పవన్ ను పరిచయం చేస్తూ ముందు నేను ఈయన మెజర్ మెంట్స్ తీసుకోవాలని బాలయ్య అంటాడు. దీనికి పవన్ పెద్దగా నవ్వుతాడు. ప్రోమోలో బాలయ్య సింగిల్ డైలాగ్ తో సరిపెట్టారు. జస్ట్ ప్రోమో అయినప్పటికీ ఈ ఎపిసోడ్ కు  హైప్ ఏర్పడింది. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.