పెద్దల సభకు పయ్యోలి ఎక్స్ప్రెస్

పెద్దల సభకు పయ్యోలి ఎక్స్ప్రెస్

పీటీ ఉష..పరుగుల రాణిగా పేరుగాంచిన ఉష..పయ్యోలిలో తన ప్రయాణాన్ని ప్రారంభించి పెద్దల సభకు వరకు చేరుకుంది. దేశానికే గర్వకారణమైన పీటీ ఉష..రాజ్యసభగా ఎంపీగాబాధ్యతలు చేపట్టింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమె  చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 

పయ్యోలిలో మొదలైన ప్రయాణం..


పీటీ ఉష పూర్తి పేరు పిలవుల్లకండి తెక్కెరపరంబిల్ ఉష. 1964 జూన్ 27న కేరళలోని పయ్యోలి గ్రామంలో జన్మించింది. పేద కుటుంబంలో జన్మించిన పిటి ఉష..చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి ఉండేది.  13 ఏళ్ల వయసులో 1979లో ఉష  జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ లో పాల్గొంది.  ఆ సమయంలో  ఆమె లోని టాలెంట్ ను గుర్తించిన  కోచ్ ఓ. నంబియార్.. కోచ్ గా మారి శిక్షణ ఇచ్చాడు. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొంది. అయితే 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా గేమ్స్ లో  100 మీ., 200 మీటర్ల పరుగులో సిల్వర్ తో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక 1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఉష ..గోల్డ్ మెడల్ తో పాటు..సరికొత్త  రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలతో మెరిసింది. 1984లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్లో  జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్లో పథమస్థానంలో నిలిచింది. కానీ తృటిలో మెడల్ కోల్పోయింది. కానీ..ఒలింపిక్స్  అథ్లెటిక్స్లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు క్రియేట్ చేసింది. 

ఇక 1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన 10 వ ఆసియా గేమ్స్ లో  పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నింట్లోనూరికార్డులు సాధించింది. అదే ఆసియాడ్లో మరో సిల్వర్ ను సొంతం చేసుకుంది.  1985లో జకార్తాలో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఉష..5 గోల్డ్ మెడల్స్  సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది.  ఇంటర్నేషనల్ కెరియర్ లో ఉష.. స్వర్ణ పతకాల సెంచరీ కొట్టింది. మొత్తంగా101 బంగారు పతకాలను సాధించింది. 

అవార్డులు...రికార్డులు.


పీటీ ఉషకు మొట్ట మొదటిసారిగా 1984లో  అర్జున అవార్డు దక్కింది. అదే ఏడాది 1984లో  భారత ప్రభుత్వం పద్మశ్రీతో  సత్కరించింది. ఇక 1985లో  జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పరిగణించబడింది. 1984, 1985, 1986, 1987, 1989 లలో ఆసియా అవార్డులో ఉత్తమ అథ్లెట్ గా అవార్డు దక్కించుకుంది. 1984, 1985, 1989, 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు పొందింది. 1986లో  సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు ఉష గెలుచుకుంది. అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఇక 1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు పొందిన ఆమె..1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డు లభించింది. తాజాగా కేంద్రం రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. 

అథ్లెట్ గా పీటీ ఉష  జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయకం. క్రీడల్లో పీటీ ఉష సాధించిన విజయాలు...ఇతర క్రీడాకారులకు ఆదర్శం.