రామప్ప బ్యాక్ వాటర్ తో కష్టాలు

రామప్ప బ్యాక్ వాటర్ తో కష్టాలు

ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు

ములుగు, వెలుగు: రామప్ప సరస్సులోకి వచ్చిన బ్యాక్ వాటర్తో ములుగు మండలంలోని ఇంచర్లతోపాటు పాల్సాబ్ పల్లి, వెంకటాపూర్ మండలంలోని పాపయ్యపల్లి, నర్సాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సరస్సు నుంచి నీటిని బయటకు వదిలేందుకు మత్తడిని వెడల్పు చేసినా ఇంకా నీటిమట్టం తగ్గలేదు. ప్రధానంగా ఇంచర్లకు చెందిన పలు కాలనీలు నీట మునగడంతో జంగాలపల్లి క్రాస్లోని పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే తమను పట్టించుకోవడం లేదని కొంతమంది శనివారం రాత్రి ఇండ్లకు చేరుకున్నారు. పంచాయతీ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతోనే తాము ఇండ్లకు చేరుకోవాల్సి వచ్చిందన్నారు. ఇండ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని వాపోతున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు భోజన ఏర్పాట్లు చేయకపోవడంతో 86మంది కాలనీ వాసులు తమకు తాము భోజనం వండుకునేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు జీపీ సిబ్బందితో కలిసి కాలనీ వాసులకు భోజనాలు వడ్డించారు. కాగా, ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ గ్రామంలోని ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామన్నారు.

For More News..

వాగులు దాటి.. సాయం చేసి..

పరిహారం ఇవ్వరు.. కొత్త ఇల్లు కట్టుకోనివ్వరు..

పేదలకు పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు