కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు తగ్గిన జర్నీలు

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు తగ్గిన జర్నీలు
  • క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లకు మళ్లీ కరోనా దెబ్బ
  • ఆర్టీసీ బస్సుల్లో 63% నుంచి 55%కి పడిపోయిన ఆక్యుపెన్సీ
  • రైళల్లోనూ అంతంతే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  కరోనా సెకండ్ వేవ్  భయంతో రాష్ట్రంలో ప్రజలు ప్రయాణాలను బంద్‌‌‌‌‌‌‌‌  పెట్టుకుంటున్నారు. కరోనాకు తోడు ఎండల వల్ల టూర్లకు వెళ్లడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో క్యాబ్​లు, ఆటోలపై మళ్లీ కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లోనూ జనం ఎక్కట్లేదు. ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ రైళ్లలోనూ రద్దీ అంతంతే ఉంది. 

క్యాబ్‌‌‌‌‌‌‌‌లు, ఆటోల డ్రైవర్ల పరిస్థితి మళ్లీ మొదటికి
కరోనా వల్ల క్యాబ్, ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బపడింది. ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతుండగా.. ఇంతలోనే కరోనా సెకండ్‌‌‌‌‌‌‌‌  వేవ్‌‌‌‌‌‌‌‌ రూపంలో వారిపై ఎఫెక్ట్‌ పడింది. ఓలా, ఊబెర్‌ డ్రైవర్లు రోజూ 16  నుంచి 18 గంటల పాటు ఉంటున్నా ఆశించిన స్థాయిలో బుకింగ్‌‌‌‌‌‌‌‌లు రావడం లేదు. రాష్ట్రంలో లక్షకుపైగా క్యాబ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్లు, 80 వేల మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నారు. కరోనా కంటే ముందు ఒక్కో క్యాబ్​ డ్రైవర్​ రోజుకు  రూ.1,500 నుంచి 2,000 వరకు సంపాదించేవారు. ప్రస్తుతం రూ. 500 కూడా దాటడంలేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నెల తిరిగేసరికి బ్యాంకులు, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థలకు కిస్తీలు కట్టాల్సిందేనని, గిరాకీ తగ్గిపోయిందని, ఎక్కడి నుంచి కట్టాలని వారు వాపోతున్నారు. గతేడాది కరోనా విజృంభణతో అనేక మంది కార్లు అమ్ముకున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి సర్దుకుంటుందని అనుకుంటుండగా మళ్లీ సెకండ్​ వేవ్​ రూపంలో కరోనా తమ ఉపాధిపై దెబ్బ కొట్టిందని డ్రైవర్లు అంటున్నారు. 

ఆర్టీసీ బస్సులనూ ఎక్కుతలేరు
గత ఏడాది కరోనా వల్ల నెలలతరబడి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు మళ్లీ స్టార్టయినా మొదట్లో ఆర్టీసీ కలెక్షన్‌‌‌‌‌‌‌‌  రోజుకు రూ. కోటి కూడా దాటలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రయాణికులు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అధికారులు బస్సుల సంఖ్యను కూడా పెంచారు. గత నెల వరకు ఆర్టీసీకి ప్రతి రోజు రూ.12 కోట్లపైనే కలెక్షన్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 63 శాతం నుంచి 65 శాతం దాకా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌‌‌‌‌‌‌‌) నమోదైంది. గాడిన పడుతున్న క్రమంలోనే మళ్లీ వారం రోజులుగా పరిస్థితి తలకిందులైంది. కరోనా సెకండ్​ వేవ్​ భయంతో  ప్రయాణికులు బస్సుల్లో జర్నీ చేసేందుకు వెనకాడుతున్నారు. ఇప్పుడు 55 శాతం ఓఆర్‌‌‌‌‌‌‌‌తో రూ. 10 కోట్ల కలెక్షన్లే వస్తున్నాయి.  

అత్యవసరమైతే సొంత వాహనాల్లోనే ప్రయాణం
కరోనా వ్యాప్తి భయంతో జనాలు సొంత వాహనాలనే  ఉపయోగిస్తున్నారు.  కరోనా టైంలోనే అనేక మంది వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కొనుక్కున్నారు. ముఖ్యంగా సెకండ్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్ కార్లను కొనుగోలు చేశారు. కరోనా బారిన పడి ఇబ్బందులు పడే కంటే సొంత వాహనాల్లో వెళ్లడమే బెటర్‌‌‌‌‌‌‌‌ అని అభిప్రాయపడుతున్నారు.