ఆత్మ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూజల గోపికృష్ణ

ఆత్మ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూజల గోపికృష్ణ

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జిల్లాకేంద్రానికి చెందిన పూజల గోపికృష్ణ నియమితులయ్యారు.  గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆత్మ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు 27 మంది సభ్యులకు జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నియామకపు పత్రాలను అందజేశారు. గోపికృష్ణ ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ కార్యకర్తగా, పట్టణ అధ్యక్షునిగా పనిచేశారు.  విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ  యూత్ కాంగ్రెస్  రాష్ట్ర స్థాయి పదవులు చేపట్టారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన సీఎం  రేవంత్ రెడ్డి,  టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్,  మంత్రి  వివేక్ వెంకటస్వామి, మంత్రులు రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పూజల హరికృష్ణ  కృతజ్ఞతలు తెలిపారు.