టెస్టుల్లో 7వేల పరుగులు చేసిన పూజారా

టెస్టుల్లో 7వేల పరుగులు చేసిన పూజారా

టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర పూజారా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 7వేల పరుగులు చేసిన 8వ భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో పూజారా ఈ ఘనతను అందుకున్నాడు. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ రికార్డుకు 16 పరుగుల దూరంలో ఉన్న పూజారా..తొలి వికెట్‌ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతడు..16 పరుగులు చేసి 7 వేల పరుగుల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు.

ఇక  పుజారా కంటే ముందు సచిన్‌ ,ద్రవిడ్, సునీల్‌ గవాస్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌,  సెహ్వాగ్‌, కోహ్లి, గంగూలీలు 7వేల పరుగులు సాధించారు. తొలి ఇన్నింగ్స్ లో 24 పరుగులు చేసిన పూజారా..తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. 

ద్రావిడ్ వారసుడిగా టీమిండియాలోకి వచ్చిన పూజారా..ఎన్నో అత్యుత్తమ ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఈ ఏడాది ఫాంలేమితో తంటాలు పడ్డాడు. అయితే కౌంటీలో ఆడి ఫాంలోకి వచ్చాడు. టన్నుల పరుగుల వరద పారించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పుజారా..టీమిండియాకు తిరిగి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో సుమారు నాలుగేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు.