గౌహతి: ఆటగాడిగా, కోచ్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఇండియా బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇప్పుడు క్రీడా రాజకీయాల్లో అడుగుపెట్టాడు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ఉపాధ్యక్షుడిగా గోపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు . శుక్రవారం జరిగిన బాయ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్వ రెండోసారి బాయ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

