పంజాబ్ లోని ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మొహాలీలో ఓ బిల్డింగ్ లోని 9 అంతస్తు నుంచి నోట్లకట్టలు రోడ్డుపై పడేశారు. ఆకాశంనుంచి జారి పడుతున్న నోట్లకు పడుతుంటే జనం ఆశ్చర్యపోయారు. నోట్ల కట్టలు ఎక్కడినుంచి పడుతుతున్నాయో తెలుసుకునే లోపే ఈడీ అధికారులు రంగలో దిగి సీజ్ చేశారు. ఓ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు అపార్టుమెంట్ లోని నిందితుల ఇళ్లపై దాడులు చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
పంజాబ్ లోని మొహాలీలో ఓ అపార్టుమెంట్ 9 వ అంతస్తునుంచి ఈ నోట్ల కట్టలు కిందకు విసిరారు. శుక్రవారం (మే8) పంజాబ్ లో జరిగిన భారీ భూకుంభకోణంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈడీ అధికారులకు దొరకకుండు ఉండేందుకు నిందితులు రూ. 21 లక్షల విలువైన నోట్లకట్టలను బాల్కనీ నుంచి కిందికి విసిరారు. అయితే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏంటా భూ కుంభకోణం..
మొహాలీకి చెందిన రెండు రియల్ ఎస్టేట్ గ్రూపులు ఇండియన్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ, సన్‌టెక్ సిటీ ప్రాజెక్టుపై ఈడీ దాడులు చేసింది. ఈ కంపెనీలు ఎలాంటి అనుమతులు లేకుండా మోసపూరితంగా 30.5 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుులు సురేష్ కుమార్ బజాజ్, అజయ్ సెహగల్ భారీ స్థాయిలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రియల్ వ్యాపారులు సురేష్ కుమార్ బజాజ్ , అజయ్ సెహగల్.. ప్లాట్లు ఇప్పిస్తామని నకిలీ డాక్యుమెంట్లు అంటగట్టి కోట్ల రూపాయలు బాధితులనుంచి దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఓనర్ షిప్ డాక్యుమెంట్లు ఇవ్వకుండానే ఆ సొసైటీ రూ. 150 కోట్ల రూపాయలు బాధితులనుంచి వసూలు చేశారని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఈడీ శుక్రవారం (మే8) మొహాలీలోని నిందితుల ఇల్లు, సొసైటీ ఆఫీసులపై దాడులు చేసింది. ఈ క్రమంలో నిందితులు ఈడీ అధికారులనుంచి తప్పించుకునేందుకు నోట్లకట్లను రోడ్డున పడేసినట్లు గుర్తించారు అధికారులు.
