మూడేళ్ల ముందు ఏమీ లేవు.. ఇప్పుడు ఎక్స్ ప్రెస్‌వే

మూడేళ్ల ముందు ఏమీ లేవు.. ఇప్పుడు  ఎక్స్ ప్రెస్‌వే

గత పాలకులు ఉత్తరప్రదేశ్  అభివృద్ధిని పట్టించుకోలేదని, రాష్ట్రంలోని ఓప్రాంతాన్ని, అక్కడి ప్రజలను మాఫియాకు రాసిచ్చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బీజేపీ పాలనలో ఉత్తర ప్రదేశ్ లో కొత్త శకం మొదలైందన్నారు. సుల్తాన్ పుర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ శక్తిసామర్థ్యాలను ప్రశ్నించే వారు..సుల్తాపుర్ వచ్చి అభివృద్ధిని చూడాలన్నారు. మూడేళ్ల ముందు పూర్వాంచల్ లో ఏమీ లేవని.. ఇప్పుడు అత్యాధునిక ఎక్స్ ప్రెస్ వేను అందుబాటులోకి తెచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ 

లక్నో నుంచి యూపీ తూర్పు ప్రాంతాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు. ఆరులైన్ల ఈ ఎక్స్ ప్రెస్ వే బరాబంకి, అమేఠి, సుల్తాన్ పుర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, ఆజాంగఢ్, గాంజీపూర్ జిల్లాలను కలుపుతూ రహదారిలో భాగంగా సుల్తాన్ పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ సిద్ధం చేశారు అధికారులు.. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.