V6 News

ఇదే లాస్ట్ చాన్స్.. లొంగిపోండి..! బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అవినీతిపరులు, గూండాలకు మోదీ వార్నింగ్

ఇదే లాస్ట్ చాన్స్.. లొంగిపోండి..! బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అవినీతిపరులు, గూండాలకు మోదీ వార్నింగ్
  • గిరిజన భూములను కబ్జా చేస్తున్నారు.. మే 4 తర్వాత వేట మొదలుపెడ్తం
  • పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళా బిల్లు వీగిపోవడానికి కారణం టీఎంసీ పార్టీనే
  • చొరబాటుదారుల కోసమే దీదీ పాలన అంటూ ఫైర్​
  • మహిళల కోసం మాతృశక్తి భరోసా కార్డు.. ఏటా 36 వేలు
  • బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల నేపథ్యంలో భారీగా పథకాలు ప్రకటించిన మోదీ 

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అవినీతిపరులు, గూండాలకు ఇదే చివరి అవకాశం అని, వారు వెంటనే లొంగిపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాష్ట్రంలో సిండికేట్లు గిరిజన భూములను కబ్జా చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. ఆదివారం జంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మహల్ ప్రాంతంలో మోదీ పర్యటించారు.  బంకురా, పురూలియా, ఝార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రామ్, బిష్ణుపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీలు, సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘నేను ముందే హెచ్చరిస్తున్నాను.. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ ముగిసేలోపు మీ పాపాలు ఒప్పుకొని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో లొంగిపోండి. 

మే 4న ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. బెంగాల్ పులిలాంటి ప్రజలు మిమ్మల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు” అని అవినీతిపరులు, గూండాలకు వార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.  పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు –2026) వీగిపోవడానికి టీఎంసీ పార్టీనే కారణమని మోదీ ఆరోపించారు. బెంగాల్ మహిళలు చట్టసభల్లోకి వస్తే తమ మాఫియా పాలన అంతమవుతుందని భయపడే మమతా బెనర్జీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ బిల్లును అడ్డుకుందని విమర్శించారు. తన ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా మమత ఓటు వేయించారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. బెంగాల్ ఆడబిడ్డలకు మమత చేసిన అతిపెద్ద ద్రోహం ఇదేనని అన్నారు.  దీనికి రాష్ట్ర మహిళలు ఓటు ద్వారా తగిన శిక్ష విధిస్తారని పేర్కొన్నారు.

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అస్తిత్వాన్ని కాపాడడమే లక్ష్యం..

బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడడమే ఈ ఎన్నికల లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ‘‘టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారుల కోసం, చొరబాటుదారుల ద్వారా నడుస్తోంది. ఇక్కడి స్థానిక భాషలు, సంస్కృతి కంటే చొరబాటుదారుల మతం, భాషకే మమత ప్రాధాన్యం ఇస్తున్నారు. సంతాలి, కుర్మాలిలాంటి భాషలను నిర్లక్ష్యం చేస్తూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని ఆరోపించారు. ‘‘15 ఏండ్ల టీఎంసీ పాలనలో గిరిజన ప్రాంతాలకు దక్కిందేమిటి? విద్య లేదు, ఉపాధి లేదు, కనీసం వైద్యం, సాగునీరు కూడా అందడం లేదు. రాష్ట్రంలో ప్రజలు చీకట్లో మగ్గుతుంటే.. టీఎంసీ నాయకులు మాత్రం బంగ్లాలు, కార్లతో మెరిసిపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ‘మహా జంగిల్ రాజ్’ నడుస్తోందని మండిపడ్డారు. గిరిజన భూములను సిండికేట్లు కబ్జా చేస్తున్నాయని, లంచం లేనిదే ఏ పనీ కావడం లేదని ధ్వజమెత్తారు. 

దేశానికి మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని బీజేపీ ఇస్తే, గిరిజన వ్యతిరేక టీఎంసీ ఆమెను అవమానించిందని విమర్శించారు. బొగ్గు కుంభకోణానికి పాల్పడుతున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర సంపదను దోచుకుంటూ, ప్రజలను చీకట్లోకి నెట్టేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి లెక్క తేలుస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం ఈసారి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించుకుందని తెలిపారు. బెంగాలీ భాషకు శాస్త్రీయ హోదా కల్పించింది బీజేపీయేనని, తాము అధికారంలోకి వస్తే సంతాలీ, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బన్షీలాంటి భాషలను మరింత బలోపేతం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.23న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లందరూ ఏకమై మార్పు కోసం ఓటు వేయాలని  పిలుపునిచ్చారు.

మహిళలపై మోదీ వరాల జల్లు

మమతా బెనర్జీ ఓటు బ్యాంకుగా భావించే మహిళలను ఆకట్టుకునేలా మోదీ భారీ వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు ఇచ్చారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  మాతృశక్తి భరోసా కార్డ్ ద్వారా ప్రతి నిరుపేద మహిళకు ఏడాదికి రూ. 36,000 అందిస్తామని  చెప్పారు. ఆడపిల్లల చదువు కోసం రూ.50 వేలు, గర్భిణులకు రూ.21వేలు సాయం ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించి, మహిళలకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తామని చెప్పారు. 

బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎవరూ దొంగిలించలేరని, ప్రతి మహిళకు ఉచిత రేషన్​ అందేలా చూస్తామన్నారు.  పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు శాశ్వత ఇండ్ల కోసం రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పొరుగున ఉన్న అస్సాం, త్రిపుర, ఒడిశా, బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళలకు అందుతున్న పథకాలు.. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీఎంసీ ప్రభుత్వం వల్ల లభించడం లేదని చెప్పారు. ‘‘ఒడిశా, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిరిజనులను బీజేపీ ముఖ్యమంత్రులను చేసింది. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యం” అని పేర్కొన్నారు.