V6 News

విజయవాడ అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు దంపతుల అల్పాహారం...

విజయవాడ అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు దంపతుల అల్పాహారం...

ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా విజయవాడలోని అన్న క్యాంటీన్ కు సతీసమేతంగా వెళ్లి అల్పాహారం చేశారు. సోమవారం ( ఏప్రిల్ 20 ) విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్ లో సీఎం దంపతులు అల్పాహారం చేశారు. ఉదయం 9:30 గంటల సమయంలో అన్న క్యాంటీన్ కు చేరుకున్న సీఎం దంపతులు ప్రజలకు అల్పాహారం వడ్డించి అనంతరం అదే క్యాంటీన్ లో అల్పాహారం తీసుకున్నారు. 

చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమని భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు ఒక రోజు ఖర్చు రూ.76 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.

అన్న క్యాంటీన్ లో అల్పాహారం కోసం వచ్చిన ప్రజలు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ, వంటల శుచి శుభ్రత వంటి అంశాలపై  సిబ్బందితో ముచ్చటించారు చంద్రబాబు. అల్పాహారం తీసుకునే సమయంలో ప్రజల తో మాట్లాడుతూ సంక్షేమ పధకాల అమలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.