V6 News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, వెలుగు :  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారంతోనే సముచిత గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం జీవోల పేరుతో కుంటిసాకులు చెబుతూ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కృషి వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల రూపంలో గుర్తింపు లభించిందన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్యాధికారం దిశగా సాగాలని ఆయన సూచించారు.