V6 News

యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మున్నూరుకాపు భవన్ లో  ఉదయం 10 గంటలకు మొదలైన కల్యాణ మహోత్సవం రెండు గంటల పాటు నయనానందకరంగా జరిగింది. యాదగిరిగుట్ట ఆలయ రిటైర్డ్ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యుల అర్చకత్వంలో అర్చక బృందం లక్ష్మీనారసింహుల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్, ఆకుల లలిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా మొదట సుదర్శన నారసింహ విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహించిన అర్చకులు అనంతరం లక్ష్మీనారసింహుల కల్యాణాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. కార్యక్రమంలో పీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీలు రుద్ర సంతోష్ కుమార్, పలుగుల శ్రీనివాస్, మున్నూరుకాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, రాష్ట్ర కోఆర్డినేటర్ తూడి జనార్దన్, నాయకులు కుమారస్వామి ఉన్నారు.