
అల్లు అర్జున్(Allu arjun) బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చింది పుష్ప టీం. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ టీజర్ తో పాటు పుష్ప 2(Pushpa 2) నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా బన్నీ సరికొత్త లుక్ ను పరిచయం చేసింది.
గంగమ్మ జాతర అమ్మోరి లుక్ లో బన్నీని చూపించిన సుకుమార్(Sukumar) సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాడు. ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘పుష్ప2.. ద రూల్ బిగిన్స్’ అంటూ విడుదలైన ఈ లుక్.. ట్విట్టర్ లో ఆల్ టైం రికార్డును నమోదు చేసింది.
ట్విట్టర్ లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధిక లైకులు సాధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గా నిలిచింది. ఇప్పటి వరకు రాంచరణ్ గేమ్ ఛేంజర్ పోస్టర్ పేరిట ఉన్న ఈ రికార్డును పుష్ప రాజ్ బీట్ చేశాడు. 24 గంటలు గడవక ముందే రెండు లక్షలకు పైగా లైకులు పొందిన ఫస్ట్ లుక్ కూడా ఇదే కావడం విశేషం.
తాజాగా విడుదలైన పుష్ప 2 టీజర్ సైతం ఇదే బాటలో సాగుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే టాలీవుడ్ ఫ్యాన్స్ కు హిందీ ఆడియెన్స్ షాకిచ్చారు. యూట్యూబ్ లో తెలుగులో విడుదలైన టీజర్ కు 18 మిలియన్ల వ్యూస్ వస్తే.. ఊహించని విధంగా హిందీ టీజర్ కు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నార్త్ ఆడియెన్స్ లో పుష్ప క్రేజ్ కు ఇది నిదర్శనం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.