పుష్ప నుంచి మరో సాంగ్ ప్రొమో

పుష్ప నుంచి మరో సాంగ్ ప్రొమో

అల్లు అర్జున్ హీరోగా  సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప నుంచి మరో సాంగ్ ప్రొమో వచ్చేసింది. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్‌కు సంబంధించిన ప్రోమోను మంగళవారం రాత్రి  విడుదల చేసింది యూనిట్. నవంబర్ 19 ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదలకాగా.. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. మరోసారి తనదైన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడని.. సోషల్ మీడియాలో ఈ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.